రాజమౌళి డైరక్షన్ లో ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి చేస్తున్న మెగా మల్టీస్టారర్ మూవీ ఆర్.ఆర్.ఆర్. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుందని తెలుస్తుంది. పిరియాడికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో ఇంతవరకు హీరోయిన్స్ ఎవరన్నది ఇంకా రివీల్ చేయలేదు. తెలుగు, తమిళ, హింది భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ అయితే బెటర్ అని పరిణితి చోప్రా, అలియా భట్ లతో చర్చలు జరుగుతున్నాయట.
ఇక సినిమాలో ఇప్పుడు విలన్ రోల్ గురించి డిస్కషన్ మొదలైంది. ప్రతినాయకుడిగా కూడా బాలీవుడ్ స్టార్ ని తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. రాజమౌళి అసలైతే ఆర్.ఆర్.ఆర్ లో అజయ్ దేవగన్ ను తీసుకోవాలని అనుకున్నాడట. కాని ఆయన బిజీ అవడం వల్ల అక్షయ్ కుమార్ ను తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే 2.ఓ సినిమాలో అక్షయ్ కుమార్ విలన్ గా నటించి మెప్పించాడు. శంకర్, కమల్ చేస్తున్న ఇండియన్ 2 సినిమాలో కూడా అక్షయ్ కుమార్ విలన్ గా చేస్తాడని తెలుస్తుంది.
లేటెస్ట్ గా ఆర్.ఆర్.ఆర్ కోసం అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్నాడని అంటున్నారు. అదే జరిగితే మళ్లీ సినిమాకు స్పెషల్ క్రేజ్ దక్కినట్టే. బాహుబలి తర్వాత అదే స్కేల్ లో ఆర్.ఆర్.ఆర్ వస్తుంది. 2020 సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్న జక్కన్న కాస్టింగ్ తోనే సర్ ప్రైజ్ చేస్తున్నాడు.