రజిని మళ్లీ ముంచేశాడుగా

Google+ Pinterest LinkedIn Tumblr +

సూపర్ స్టార్ రజినికాంత్ హీరోగా కార్తిక్ సుబ్బరాజు డైరక్షన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన సినిమా పేట. సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా తెలుగులో థియేటర్లు లేకున్నా రిలీజ్ చేశారు. తెలుగులో ఈ సినిమాను వళ్లభనేని అశోక్ రిలీజ్ చేశారు. 21 కోట్లకు కొన్న ఈ సినిమా ఫుల్ రన్ లో 6 కోట్లు మాత్రమే రాబట్టింది. అంటే 15 కోట్ల దాకా తెలుగు నిర్మాతకు నష్టాలు తప్పలేదు. కొన్నాళ్లుగా రజిని సినిమాలు తెలుగులో పెద్దగా ప్రభావితం చూపించడం లేదు. అయినా సరే కొత్త సినిమా వస్తే చాలు రజిని సినిమాను కోట్లల్లో పెట్టి కొనేస్తున్నారు.

కబాలి, కాలా, 2.ఓ ఇలా వరుసగా రజిని అన్ని సినిమాలు తెలుగులో ఫ్లాప్ అవుతూ వచ్చాయి. ఎన్నో భారీ అంచనాలతో వచ్చిన 2.ఓ కూడా 70 కోట్లు బిజినెస్ చేస్తే 50 కోట్లు మాత్రమే రాబట్టి తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ కు 20 కోట్లు నష్టం వచ్చేలా చేసింది. అందుకే రజిని సినిమా అంటే ఇక తెలుగులో ఇక కొనడం కష్టమే అనేస్తున్నారు. పేట తర్వాత రజినికాంత్ మురుగదాస్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా బిజినెస్ ఎలా ఉంటుందో చూడాలి. పేట సినిమా తమిళంలో కూడా బ్రేక్ ఈవెన్ సాధించలేదని తెలుస్తుంది. పోటీగా అజిత్ విశ్వాసం రిలీజ్ అవడంతో అక్కడ గట్టి పోటీ ఏర్పడింది.

Share.