యాంగ్రీ యంగ్ మెన్ అనగానే అందరికి గుర్తొచ్చేది డాక్టర్ రాజశేఖర్. పిఎస్వి గరుడెవేగ సినిమాతో మళ్లీ ఫాంలోకి వచ్చిన రాజశేఖర్ ప్రస్తుతం ప్రశాంత్ వర్మ డైరక్షన్ లో కల్కి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను సి. కళ్యాణ్ నిర్మిస్తున్నారు. ఈరోజు రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా నిన్న సాయంత్రం కల్కి టీజర్ రిలీజ్ ఈవెంట్ జరిపారు.
ఈవెంట్ లో భాగంగా డైరక్టర్ ప్రశాంత్ వర్మ రాజశేఖర్ ఫ్యామిలీ మీద ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. అందరు అనుకున్నట్టుగా రాజశేఖర్ కాదని ఆయన, ఆయన ఫ్యామిలీ చాలా మంచిదని అన్నారు ప్రశాంత్ వర్మ. యాంగ్రీ యంగ్ మెన్ కాదు ఇప్పటినుండి ఈయన యాంగ్రీ స్టార్ అనే బిరుదు ఇచ్చాడు ప్రశాంత్ వర్మ.
రాజశేఖర్ ఫ్యామిలీ తనని ఫుడ్ తో చంపేశారని అన్నాడు ప్రశాంత్ వర్మ. రాజశేఖర్ కూడా ఈ సినిమాతో మళ్లీ తనకు మంచి పేరు వస్తుందని. గరుడవేగ టైంలో ఎలాంటి అనుభూతిని పొందానో అదే అనుభూతిని కల్కిలో పొందానని. ఈ సినిమా గురించి తాను ఎక్కువ చెప్పనని సినిమానే మాట్లాడుతుందని అన్నారు రాజశేఖర్.