తమిళంలో రౌడీ హీరో క్రేజ్ అలా వాడుతున్నారు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

యువ హీరో విజయ్ దేవరకొండ సంచలనానికి మారు పేరుగా మారాడని చెప్పొచ్చు. పెళ్లిచూపులు సినిమా నుండి టాక్సీవాలా వరకు చేసిన 6 సినిమాల్లో విజయ్ 4 విజయాలను అందుకున్నాడు. ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు అతను నటించిన ద్వారక సినిమాను తమిళంలో రిలీజ్ చేస్తున్నారు. ఆ సినిమాకు తమిళ టైటిల్ గా అర్జున్ రెడ్డి అని పెట్టారు. అర్జున్ రెడ్డి సినిమాకు ఉన్న క్రేజ్ ను వాడుకునేందుకు తమిళ నిర్మాతలు వేసిన ప్లాన్ ఇది.

ఆల్రెడీ విజయ్ నటించిన అర్జున్ రెడ్డి సినిమా తమిళంలో వర్మగా రీమేక్ అవుతుంది. చియాన్ విక్రం తనయుడు ధ్రువ్ ఆ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అయినా సరే అర్జున్ రెడ్డి టైటిల్ పెడితే అక్కడ ఈ సినిమాకు మంచి క్రేజ్ వస్తుందని అలా ఫిక్స్ చేశారన్నమాట. విజయ్ దేవరకొండ ఆల్రెడీ నోటా సినిమాతో తమిళ ప్రేక్షకులను పలుకరించాడు. అయితే ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ప్రస్తుతం తమిళంలో కూడా స్టార్ సినిమాలు ఏవి లేకపోవడంతో ద్వారక సినిమాను అర్జున్ రెడ్డి టైటిల్ తో అక్కడ వదులుతున్నారు. మరి ఈ సినిమా విజయ్ కు అక్కడ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

Share.