టాలీవుడ్ యంగ్ కమెడియన్ రాహుల్ రామకృష్ణకు హాలీవుడ్ సినిమా ఆఫర్ వచ్చింది. ఏంటి ఇది కామెడీ అనుకునేరు.. నిజంగానే నిజం.. అర్జున్ రెడ్డిలో శివ పాత్రలో అదరగొట్టిన రాహుల్ రామకృష్ణ తెలుగులో ఈమధ్య వరుస సినిమాలు చేస్తున్నాడు. అతను చేస్తున్న కామెడీకి ఆడియెన్స్ కడుపుబ్బా నవ్వుతున్నారు. ఇటీవల హుషారు సినిమా చేసిన రాహుల్ రామకృష్ణ ఆ సినిమా హిట్ లో కూడా తన భాగస్వామ్యం అయ్యాడు. ఇక ఇప్పుడు రాహుల్ ఓ హాలీవుడ్ సినిమా చేస్తున్నాడట.
అమెరికాలో ఫిల్మ్ మేకర్ అయిన ప్రదీప్ కాటసాని ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. సిల్క్ రోడ్ అనే టైటిల్ తో రాహుల్ రామకృష్ణ సినిమా వస్తుంది. సినిమా మొత్తం అమెరికాలోనే షూటింగ్ జరుపుకుంటారని తెలుస్తుంది. సైబర్ క్రైం.. డ్రగ్స్ చుట్టూ తిరిగే కథతో ఈ సినిమా వస్తుందట. రాహుల్ రామకృష్ణ నటిస్తున్నాడు కాబట్టి ఆ సినిమా తెలుగులో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. రెండేళ్ల సిని కెరియర్ లో హాలీవుడ్ ఛాన్స్ అందుకోవడం అంటే రాహుల్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
ఇక ప్రియదర్శితో తాను చేసిన మిటాయి సినిమా కూడా ఈ నెల 14న రిలీజ్ కాబోతుంది. చిన్న సినిమాల్లో సరికొత్త సంచలనం సృష్టిస్తున్న నేటి యువ దర్శకులు రాహుల్ లాంటి టాలెంటెడ్ ఆర్టిస్టులను బాగా వాడేస్తున్నారు.