జాన్వి కపూర్ అసలేమాత్రం తగ్గట్లేదు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ బాలీవుడ్ లో తన సత్తా చాటాలని చూస్తుంది. మొదటి సినిమా దఢక్ తోనే అదరగొట్టిన అమ్మడు ప్రస్తుతం కరణ్ జోహార్ నిర్మాణంలో తక్త్ సినిమా చేస్తుంది. మరిన్ని ఆఫర్స్ కూడా వస్తున్నట్టు తెలుస్తుంది. సౌత్ భాషల్లో కూడా సినిమాలు చేసేందుకు రెడీ అంటున్న జాన్వి కపూర్ మంచి అవకాశం వస్తే తెలుగులో కూడా నటిస్తానని చెప్పుకొచ్చింది. ఇక సినిమాలతోనే కాదు ఫోటో షూట్స్ తో కూడా ఆడియెన్స్ ను అలరించ వచ్చని గుర్తించిన ఈ అమ్మడు నెలకో హాట్ ఫోటో షూట్ తో అదరగొడుతుంది.

ఇప్పటికే డబు రత్నాని క్యాలెండర్ లో దుమ్ము దులిపే అందంతో కనిపించిన జాన్వి కపూర్ హలో మేగజైన్ కవర్ పేజ్ కు ఎక్కింది. రెడ్ హాట్ లుక్స్ తో జాన్వి ఐ అటెన్షన్ ఏర్పరచుకుంటుంది. కెరియర్ తొలినాళ్లలోనే అమ్మడు స్పీడ్ చూసి అందరు షాక్ అవుతున్నారు. తన తల్లి శ్రీదేవి అంతటి స్టార్ క్రేజ్ తెచ్చుకునేందుకు కష్టపడుతున్న జాన్వి కపూర్ ఎలాంటి అవకాశాన్ని వదులుకోకుండా చేస్తుంది. ఆర్.ఆర్.ఆర్ లో తను కూడా ఒక హీరోయిన్ గా నటిస్తుందని చెబుతున్నా అఫిషియల్ గా మాత్రం ఇంకా వెళ్లడించలేదు.

జాన్వి చేస్తున్న ఈ ప్రయత్నాలన్ని తనకు క్రేజ్ తీసుకు రావాలని ఆశిద్దాం. మన తెలుగు హీరో విజయ్ దేవరకొండ నటన గురించి మొన్నామధ్య ఓ టివి షోలో మాట్లాడిన జాన్వి కపూర్ ఛాన్స్ వస్తే అతనితో నటించేందుకు రెడీ అన్నది. మరి మన దర్శక నిర్మాతలు ఆ కాంబో సెట్ చేసే ప్రయత్నం చేస్తే బెటర్.

Share.