గ్లామర్ ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు ఎలా క్లిక్ అవుతారు అన్నది చెప్పడం చాలా కష్టం. కొద్దిపాటి టాలెంట్ ఉండి సూపర్ క్రేజ్ తెచ్చుకునే భామలు ఉంటారు. టన్నులకొద్ది టాలెంట్ ఉన్నా అసలు లక్ కలిసి రాని వారు ఉంటారు. వారిలో చెప్పుకోవాలంటే చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది. కాని ముందుగా మాత్రం అలాంటివారిలో అదా శర్మ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. బాలీవుడ్ లో 1920 సినిమాలో నటించిన అమ్మడు తెలుగులో పూరి డైరక్షన్ లో వచ్చిన హార్ట్ ఎటాక్ తో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో ఆమె అందానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
అయితే సరైన సినిమాల ఎంపిక చేసుకోలేని అదా శర్మ ఫేడవుట్ అయినట్టే అనుకున్నారు. కాని తన ఫాలోవర్స్ ను సోషల్ ఫ్లాట్ ఫాం ద్వారా అలరిస్తుంది అదా శర్మ. ఇక అమ్మడు చేసే హాట్ షోకి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎలాంటి వీడియో అయినా సరే తన స్కిన్ షోతో ఆకట్టుకుంటుంది అదా శర్మ. లేటెస్ట్ గా మరో క్రేజీ వీడియోతో వచ్చింది ఈ అమ్మడు. బెల్లీ డ్యాన్స్ చేస్తూ బెంబేలెత్తించేసిన అదా శర్మ చేతిలో బీర్ బాటిలో కిరాక్ అనిపించింది. అయితే చివర్లో సర్ ప్రైజ్.. ఇదో మెసేజ్ ఇచ్చేందుకు అదా చేసిన ప్రయత్నం.
ఈ విధంగా తనకు తాను ప్రమోట్ చేసుకోవడంతో పాటుగా తన హాట్ షోని ప్రేక్షకుల ముందుకు తెస్తుంది. మెసేజ్ మాట పక్కన పెడితే అదా బెల్లీ డ్యాన్స్.. నడుము ఒంపులకు ప్రేషకులు డిస్ట్రబ్ అయ్యారని మాత్రం చెప్పొచ్చు. తెలుగులో అవకాశాలు లేని అదా శర్మ బాలీవుడ్ లో అరకొర అవకాశాలతో కెరియర్ సాగిస్తుంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం అదా చేసిన ఈ బెల్లీ డ్యాన్స్ దుమ్ముదులిపేస్తుంది. సినిమాల్లో ఛాన్సులు లేకున్నా అదా అదరగొట్టే షో మాత్రం అందరిని ఇంప్రెస్ చేసింది. ఈమధ్య అమ్మడు యాడ్స్ లో బాగానే కనిపిస్తుంది. అది కూడీ వీటి వల్లనే అని తెలుస్తుంది.