వివిఆర్ ప్రీ రిలీజ్ బిజినెస్.. చరణ్ దమ్ము చూపించాడంతే..!

Google+ Pinterest LinkedIn Tumblr +

రాం చరణ్, బోయపాటి కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా వినయ విధేయ రామ. ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత అంచనాలు అధికమయ్యాయి. చరణ్ లోని మాస్ యాంగిల్ ను బోయపాటి పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేశాడన్న టాక్ వినిపిస్తుంది. ఇదిలాఉంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లో కూడా దమ్ము చూపిస్తున్నాడు రాం చరణ్. చరణ్ కెరియర్ లోనే కాదు తెలుగు సినిమా పరిశ్రమలోనే టాప్ 5 స్థానంలో చరణ్ వివిఆర్ బిజినెస్ జరిగింది.

ఇంతకీ వినయ విధేయ రామ బిజినెస్ రేంజ్ ఎంత అంటే.. 94.10 కోట్లని తెలుస్తుంది. చరణ్, బోయపాటి రేంజ్ కు తగినట్టుగానే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మెగా కాంపౌండ్ లో స్టైలిష్ స్టార్ తో సరైనోడు సినిమా చేశాడు బోయపాటి శ్రీను ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అంతేకాదు బన్నికి మాస్ ఇమేజ్ తీసుకురావడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఇప్పుడు వివిఆర్ లో రాం చరణ్ కూడా అదరగొట్టినట్టు తెలుస్తుంది. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఏ రేంజ్ సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

ఏరియా వైజ్ గా వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటైల్స్..

నైజాం: 20 కోట్లు
సీడెడ్: 15 కోట్లు
ఉత్తరాంధ్ర: 11.70 కోట్లు
ఈస్ట్ : 7.20 కోట్లు
వెస్ట్: 5.60 కోట్లు
కృష్ణా: 6 కోట్లు
గుంటూరు: 7.80 కోట్లు
నెల్లూరు: 3.30 కోట్లు
ఏపీ/తెలంగాణా: 77 కోట్లు
రెస్ట్ అఫ్ ఇండియా : 8.50 కోట్లు
ఓవర్సీస్: 9 కోట్లు

వరల్డ్ వైడ్ టోటల్: 94.10 కోట్లు

Share.