దగ్గుబాటి వారసుడిగా వెంకటేష్ తర్వాత హీరోగా నిలబడిన రానా తన మార్క్ సినిమాలను చేస్తూ వస్తున్నాడు. బాహుబలిలో ప్రభాస్ ఎంత క్రేజ్ తెచ్చుకున్నాడో భళ్లాదేవగా రానా కూడా అంతే ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. హీరో, విలన్ తేడా లేకుండా సెన్సేషన్స్ క్రియేట్ చేస్తున్న రానా ఓ పక్క గుణశేఖర్ తో హిరణ్యకశ్యప అంటూ ఓ ప్రెస్టిజియస్ మూవీకి సిద్ధమవుతున్న రానా మరో భారీ మూవీని ప్లాన్ చేస్తున్నాడు. రుద్రమదేవి తర్వాత గుణశేఖర్ చేస్తున్న హిరణ్యకశ్యప సినిమాపై అంచనాలు పెరిగాయి.
ఇక ఇప్పుడు నీది నాది ఒకే కథ సినిమా దర్శకుడు వేణు ఊడుగుల డైరక్షన్ లో విరాటపర్వం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా పిరియాడికల్ మూవీగా తెరకెక్కుతుందని తెలుస్తుంది. 40 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ అద్భుతంగా రాబోతుందట. స్టార్స్ కు షాక్ ఇచ్చేలా రానా సినిమాలు భారీగా ప్లాన్ చేస్తున్నాడు. స్టార్స్ కు పోటీగా సత్తా చాటుతున్న రానా దమ్ము చూపించేందుకు రెడీ అవుతున్నాడు.
విరాటపర్వం 1992 మూవీ సినిమా డిఫరెంట్ స్టోరీగా వస్తుందట. తప్పకుండా ఈ సినిమా అంచనాలను అందుకునేలా ఉంటుందట. ఓ పక్క వేరే సినిమాల్లో గెస్ట్ రోల్ చేస్తూ వస్తున్న రానా 2019 సంచలనాలు సృష్టించేలా ఉన్నాడు. మరి రానా ఈ ప్రాజెక్టులు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.