స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య తర్వాత తర్వాత సినిమా అప్డేట్ గురించి ఫ్యాన్స్ అంతా ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. వక్కంతం వంశీ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా కోసం బన్ని ఎంత కష్టపడినా లాభం లేకుండా పోయింది. ఇక ఈ సినిమా తర్వాత త్రివిక్రం డైరక్షన్ లో మూవీ షురూ చేస్తున్నాడు అల్లు అర్జున్. ఈ సినిమా స్టోరీ ఓకే అవగా అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ ఇంకా ఇవ్వలేదు. న్యూ ఇయర్ గిఫ్ట్ గా బన్ని త్రివిక్రం మూవీ ఎనౌన్స్ మెంట్ చేస్తారట. సినిమా టైటిల్ కూడా రివీల్ చేస్తారని తెలుస్తుంది.
త్రివిక్రం, అల్లు అర్జున్ ఇద్దరు కలిసి జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి రెండు సినిమాలు సూపర్ హిట్ కొట్టారు. హ్యాట్రిక్ కాంబోగా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. న్యూ ఇయర్ తో సర్ ప్రైజ్ ఇచ్చి జనవరి ఎండింగ్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కు వెళ్తారని తెలుస్తుంది. అజ్ఞాతవాసి ఫ్లాప్ తర్వాత త్రివిక్రం ఎన్.టి.ఆర్ తో చేసిన అరవింద సమేత సూపర్ హిట్ అందుకుంది. బన్నితో త్రివిక్రం మరోసారి క్రేజీ మూవీకి సిద్ధమయ్యాడు.
అర్ధవంతమయ్యే సినిమాలతో పాటుగా మనసుని ఆలోచింపచేసే డైలాగులతో త్రివిక్రం సినిమాలు మంచి ఫలితాలను అందుకుంటున్నాయి. అరవింద సమేత సినిమాలో కూడా ఫ్యాక్షన్ కథను తన మార్క్ తో తెరకెక్కించి అదరగొట్టాడు. త్రివిక్రం సినిమా అంటే దాదాపు హిట్ అన్నట్టే లెక్క. మరి ఈ కాంబినేషన్ హిట్ రిపీట్ చేస్తుందా లేదా అన్నది సినిమా వస్తేనే కాని చెప్పలేం.