బాహుబలి సినిమా వచ్చాక సరైన కథ, కథనాలు ఉంటే ఎంత బడ్జెట్ సినిమా అయినా తీసేయొచ్చు అన్న నమ్మకం కుదిరింది. అయితే ఇందులో రాజమౌళి దర్శకత్వ ప్రతిభ ఎంతన్నది అందరికి తెలిసిందే. బాహుబలి వచ్చాక బాలీవుడ్ లో వచ్చిన పద్మావతి బాహుబలి రికార్డుల మీద కన్నేసింది. అయితే ఆ సినిమాకు అంత సీన్ లేదని తేలిపోయింది. రీసెంట్ గా వచ్చిన 2.ఓ సినిమా కూడా బాహుబలి రికార్డుల టార్గెట్ తోనే వచ్చింది. శంకర్, రజిని కాంబినేషన్ లో వచ్చిన 2.ఓ మొదటి రెండు రోజులు కలక్షన్స్ బాగానే ఉన్నా ఐదు రోజులు గడిచే సరికి అసలు పిక్చర్ ఏంటన్నది తేలిపొయింది.
ముఖ్యంగా బాహుబలిని బీట్ చేయాలన్న పంతం నెగ్గలేదని చెప్పాలి. 2.ఓ తెలుగు రెండు రాష్ట్రాల్లో 36 కోట్లు రాబట్టింది. బాహుబలి బిగినింగ్ సినిమానే మొదటి 5 రోజుల్లో 52 కోట్లు తెచ్చింది. ఈ సినిమా 66 కోట్ల బిజినెస్ తో రిలీజైంది. ఇక బాహుబలి కన్ క్లూజన్ మాత్రం 100 కోట్లు రాబట్టింది. అది కూడా 5 రోజుల్లోనే ఇక ఆ సినిమా సృష్టించిన రికార్డులు అన్ని ఇన్ని కావు. అయితే 2.ఓ విషయానికొస్తే తెలుగు రెండు రాష్ట్రాల్లో ఈ మూవీ 72 కోట్ల బిజిన్స్ తో రిలీజైంది.
5 రోజుల్లో 36 కోట్లు రాబట్టిన 2.ఓ మిగతా సగం రానున్న రోజుల్లో వసూళు చేయాల్సి ఉంది. పరిస్థితి చూస్తుంటే మళ్లీ 2.ఓ తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ కు నష్టాలు మిగిల్చేలా ఉంది. డిసెంబర్ 7న చిన్న సినిమాలు వస్తున్న నేపథ్యంలో కలక్షన్స్ ఇంకా డ్రాప్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. మరి 2.ఓ అసలు లెక్క ఎంత.. ఈ సినిమా ఫుల్ రన్ లో ఎంత తెస్తుంది అన్నది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది. 2.ఓను తెలుగులో ఎన్వీ ప్రసాద్, దిల్ రాజు కలిసి రిలీజ్ చేశారు.