తెలుగుదేశం పార్టీ పేరుచెబితే ముందుగా గుర్తుకు వచ్చేది అన్న స్వర్గీయ ఎన్టీఆర్ ! తెలుగుదేశం పార్టీ పెట్టి ఆత్మగౌరవ నినాదంతో ఆయన ముందుకు వెళ్లి పార్టీ పెట్టిన తొమ్మిది నెలల కాలంలోనే అధికారం దక్కించుకోగలిగారు. ఆ తరువాత తరువాత ఆయన శకం ముగిసింది.టీడీపీ పగ్గాలన్నీ చంద్రబాబు నాయుడు చేతికి చిక్కాయి. ఇక అప్పటి నుంచి పార్టీలో ఎన్టీఆర్ పేరు మారుమోగకుండా మెల్లిమెల్లిగా ఆ ప్రభావం తగ్గిస్తూ వచ్చాడు. అయితే… ఇంతవరకూ బాగానే సక్సెస్ అయ్యాడు బాబు.
ఇక ఆ తరువాత తన రాజాకీయ అవసరాల కోసం జూనియర్ ఎన్టీఆర్ ను చేరదీసాడు. ఆయన తో ఎన్నికల ప్రచారం చేయించుకుని పార్టీకి కావాల్సినంత మైలేజ్ సంపాదించుకున్నాడు. కాకపోతే జూనియర్ పంచ్ డైలాగులకు ప్రచార శైలికికి ప్రజల నుంచి విపరీతమైన రెస్పాన్స్ రావడం చుసిన బాబు తారక్ ను ఇలాగే వదిలిస్తే… ఏకు మేకై కూర్చుంటాడని … తన రాజకీయ వారసుడు లోకేష్ కు అడ్డు వస్తాడని భావించి ఆయన్ను మెల్లి మెల్లిగా పక్కకు పెడుతూ వస్తున్నాడు.
ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ మరణించడం .. ఆసమయంలో బాబు అన్నీ తానై నడిపించి మెల్లి మెల్లిగా నందమూరి కుటుంబానికి దగ్గరయ్యాడు. ఆ తరువాత జూనియర్ ఎన్టీఆర్ తో ఎన్నికల ప్రచారం చేయించుకున్దామని , తెలంగాణ , ఏపీలో ఆయన ప్రచారం తో ఊపు తీసుకొచ్చి లబ్ది పొందుదామని బాబు ప్రయత్నించాడు. అయితే… జూనియర్ మాత్రం ఆ విషయంలో ఆలోచనలో పడి వెనక్కి తగ్గాడు. ఆ తరువాత కూకట్ పల్లి అసెంబ్లీ సీటు నందమూరి సుహాసిని ఇవ్వడం ఇవన్నీ చక చక జరిగిపోయాయి.
నందమూరి బాలకృష్ణ విషయంలో బాబుకి వచ్చిన భయం ఏమీ లేదు. కానీ జూనియర్ విషయంలో మాత్రం బాబు కు ఉన్న భయం అంతా ఇంతాకాదు. తారక్‌తో తనకు ప్రమాదంలేదు కానీ.. తన తనయుడు లోకేష్‌కు మాత్రం ఖచ్చితంగా ప్రమాదమే. రాజకీయంగా లోకేష్ అసమర్థుడని ఇప్పటికే తేలిపోయింది. కనీసం మాట్లాడటం కూడా రాదు లోకేష్‌కు. కానీ తారక్ విషయానికి వస్తే ఈ భయం లేదు. అదే బాబుకి ఇప్పుడు ఉన్న భయం. అందుకే తారక్ ను దూరం పెట్టలేక … దగ్గర చేసుకోలేక బాబు సతమతం అవుతున్నాడు. ఇక ఎన్టీఆర్ కి బాబు అవకాశం వాదం గురించి తెలుసు కాబట్టి టీడీపీకి దగ్గరయ్యే విషయంలో ఎన్టీఆర్ ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు.