యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ ‘హలో గురు ప్రేమ కోసమే’ మంచి అంచనాల నడుమ రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఔట్ అండ్ ఔట్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా యూత్‌ను ఫుల్‌గా అట్రాక్ట్ చేసింది.
రామ్ పోతినేని మరియు అనుపమ పరమేశ్వరన్ల మధ్య నడిచే రొమాంటిక్ ట్రాక్‌కు కుర్రకారు బాగా కనెక్ట్ కావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దర్శకుడు త్రినాథ రావు నక్కిన రూపొందించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యింది. ఇక దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు మరింత బలం అందించి ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ చిత్రం టోటల్ రన్ ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా రూ.20 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసి బాక్సాఫీస్ వద్ద హిట్ చిత్రంగా నిలిచింది. ఇక ఏరియాలవారీగా ఈ సినిమా టోటల్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.
ఏరియ – క్లోజింగ్ కలెక్షన్స్(కోట్లలో)
నైజాం – 7.70 కోట్లు
సీడెడ్ – 2.90 కోట్లు
ఉత్తరాంధ్ర – 3 కోట్లు
గుంటూరు – 1.40 కోట్లు
కృష్ణా – 1.27 కోట్లు
ఈస్ట్ – 1.30 కోట్లు
వెస్ట్ – 0.92 కోట్లు
నెల్లూరు – 0.63 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 19.12 కోట్లు
రెస్టా్ఫ్ ఇండియా – 0.60 కోట్లు
ఓవర్సీస్ – 1 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ – 20.72 కోట్లు