టాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, మెహ్రీన్ కౌర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ” కవచం ” టీజర్ కొద్దీ సేపటి క్రితమే అధికారికంగా విడుదల చేసారు చిత్ర యూనిట్ సభ్యులు. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేయగా, హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తొలి సారి ఈ సినిమా ద్వారా పొలిసు పాత్రలో అభిమానులని మెప్పించనున్నారు. టీజర్ చూస్తుంటే బెల్లంకొండ ఒక పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నారని తెలుస్తుంది.
ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముకేశ్ ఒక ముఖ్య భూమిక పోషించనున్నారు. థమన్ ఈ సినిమాకి స్వరాలూ అందిస్తున్నారు. డైరెక్టర్ తేజ చాల కాలం తర్వాత దర్శకత్వం వహిస్తున్న సినిమా ” కవచం “. ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకి తీసుకు రావటానికి నిర్మాత నవీన్ సొంతినేని సన్నాహాలు చేస్తున్నారు.