తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన స్పైడర్ చిత్రం రిలీజ్‌కు ముందు ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా రిలీజ్ తరువాత మాత్రం దారుణమైన టాక్ మూటగట్టుకుని అట్టర్ ఫ్లాప్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాను భారీ రేటుకు కొన్న డిస్ట్రిబ్యూటర్లు చాలా పెద్ద మొత్తంలో నష్టాలను చవిచూసారు. ఇప్పుడు సూపర్ స్టార్ పుణ్యమా అని భారీ లాభాలు దక్కించేందుకు వారు రెడీ అవుతున్నారు.
అదేంటి ఇప్పట్లో మహేష్ సినిమా లేదాగా.. అనుకుంటున్నారా?. అయితే ఇక్కడ సూపర్ స్టార్ అంటే తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్. ఆయన నటించిన గ్రాఫిక్స్ వండర్ 2.O రిలీజ్‌కు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ విజువల్ వండర్ తెలుగు రైట్స్‌ను ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఎన్వీ ప్రసాద్ దక్కించుకున్నారు. దీంతో స్పైడర్ మీద పోగొట్టుకున్న డబ్బును ఈ సినిమాతో రాబట్టుకోవాలని ఆయన చూస్తు్న్నారు. ఇక శంకర్ సినిమా అంటే ఎలాంటి విజయాలను అందుకుంటాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.
మరి డిస్ట్రిబ్యూటర్లను ఆ సూపర్ స్టార్ దెబ్బ నుండి ఈ సూపర్‌స్టార్ కాపాడుతారా లేదా అనేది వేచి చూడాలి. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అమీ జాక్సన్ హీరోయిన్గా నటిస్తోంది. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.