లైలాలతో పని పూర్తి చేసుకున్న మజ్ను

Google+ Pinterest LinkedIn Tumblr +

అక్కినేని యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘Mr.మజ్ను’ షూటింగ్ ఫుల్ స్వింగ్‌లో ఉందనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఒక టీజర్ రిలీజ్ కాగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పటివరకు భారీ విజయం అందుకోని అఖిల్ ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

కాగా ఈ సినిమా షూటింగ్ తాజాగా పూర్తయినట్లు తెలుస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ యూత్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది. అఖిల్‌ను ఇంతకు ముందు ఎన్నడూ చూడని విధంగా ఈ సినిమాలో కనిపిస్తాడు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు మ్యూజక్ మరో ప్లస్ పాయింట్ కానున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను త్వరలో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతోనైనా అఖిల్ అనుకున్న హిట్ కొడతాడా లేడా అనేది చూడాలి. బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Share.