ప్రముఖ తమిళ నటుడు ఇళయదళపతి విజయ్ నటించిన తాజా చిత్రం ” సర్కార్ ” తెలుగు ట్రైలర్ కొద్దీ సేపటి క్రితమే విడుదల చేసారు చిత్ర బృందం. రెండు రోజుల క్రితం విడుదలైన తమిళ్ సర్కార్ టీజర్ యూ ట్యూబ్ కేవలం కొన్ని గంటల్లోనే కోటి వ్యూస్ ని సాధించిన విషయం మనందరికీ తెలిసిందే. విజయ్ నటన ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణ గా నిలవనుందని టీజర్ ని చూస్తుంటే తెలుస్తుంది. విజయ్ సరసన కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమాకి ప్రముఖ డైరెక్టర్ మురుగదాస్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం అందించగా కాలానిథి మారన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా దీపావళి కానుకగా నవంబర్ 7 న విడుదల చేయనున్నారు చిత్ర బృందం.