కొన్నాళ్లుగా దూరంగా ఉన్న నందమూరి బాలకృష్ణ, ఎన్.టి.ఆర్ ఈమధ్యనే మాటలు కలిపారు. హరికృష్ణ మరణం వల్ల అన్న కొడుకులను చేరదీశాడు బాలయ్య. ఇదే టైంలో అరవింద సమేత రిలీజ్ అవడం హిట్ కొట్టడంతో బాలయ్యను సక్సెస్ మీట్ కు ఆహ్వానించాడు ఎన్.టి.ఆర్. బాబాయ్ అబ్బాయ్ లను ఒకే వేదిక మీద చూడాలని అనుకున్న అభిమానులకు కన్నుల పండుగ జరిగింది.
అయితే అంతా బాగానే ఉన్నా వేడుకలో బాలకృష్ణ మాట్లాడిన తీరు చూస్తే ఇదంతా రాజకీయ లబ్ధి కోసమే అన్నట్టు తెలుస్తుంది. 18 నిమిషాల స్పీచ్ లో ఎన్.టి.ఆర్ పేరు నామ మాత్రంగా ఎత్తడమే కాకుండా చిత్రయూనిట్ అందరిని ప్రస్థావించి ఎన్.టి.ఆర్ ను మరిచాడు బాలయ్య. ఇక మైక్ అందుకోగా అన్న హరికృష్ణ మీద తనకు ఉన్న అనురాగాన్ని పంచుకున్నాడు. హరికృష్ణ పార్టీకి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.
బాలకృష్ణ మాట్లాడిన తీరు చూస్తే అందరికి అది సినిమా వేడుక కాదు పార్టీ ప్రచార వేడుక అన్నట్టుగా అనిపించింది. ఓ పక్క ఎన్.టి.ఆర్ మాత్రం బాబాయ్ రావడమే గొప్ప విషయమన్నట్టు.. నాన్న హోదాలో వచ్చిన బాబాయ్ కు ధన్యవాదాలు తెలిపాడు. ఎన్.టి.ఆర్ వైపు నుండి సిన్సియర్ గా ఉన్నట్టు అనిపించినా అటు వైపు నుండి మాత్రం మొక్కుబడిగానే అనిపించింది. బాలయ్య స్పీచ్ కు ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారని తెలుస్తుంది. మళ్లీ 2009లో లానే ఎన్.టి.ఆర్ ను టిడిపి ప్రచారానికి మాత్రమే వాడుకుని వదిలేస్తారేమో అన్న డౌట్ ఏర్పడుతుంది.