యంగ్ టైగర్ ఎన్టీఆర్, పూజ హేగ్దే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ” అరవింద సమేత వీర రాఘవ “. ఈ సినిమా దసరా కానుకగా విడుదలై అన్ని ప్రాంతాల్లో హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. అరవింద సమేత ప్రపంచ వ్యాప్తంగా తొలి 11 రోజుల్లో సుమారు రూ 90 కోట్ల షేర్ ని సాధించింది. ఇక తాజాగా ఈ సినిమా యూఎస్ఏ లో $ 2 .1 కలక్షన్లు సాధించి యూఎస్ లో టాప్ టెన్ తెలుగు సినిమా కలక్షన్ల జాబితాలో 10వ స్థానానికి దూసుకు వచ్చింది.
యూఎస్ఏ లో టాప్ 10 తెలుగు సినిమాలు:
బాహుబలి 2 : $20 మిలియన్
బాహుబలి 1 : $6.99 మిలియన్
రంగస్థలం : $3.51 మిలియన్
భరత్ అనే నేను : $3.46 మిలియన్
శ్రీమంతుడు : $2.89 మిలియన్
మహానటి : $2.54 మిలియన్
గీత గోవిందం: $2.46 మిలియన్
ఆ ఆ : $2.45 మిలియన్
ఖైదీ 150 : $2.44 మిలియన్
అరవింద సమేత : $2.1 మిలియన్