ఎన్టీఆర్ పై కొత్త ప్రయోగం చేయనున్న రాజమౌళి

Google+ Pinterest LinkedIn Tumblr +

అరవింద సమేత సక్సెస్ లో ఫుల్ జోష్ లో ఉన్న ఎన్.టి.ఆర్ తన తర్వాత సినిమా ట్రిపుల్ ఆర్ కోసం సంసిద్ధం కానున్నాడు. రాజమౌళి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ తో పాటుగా చరణ్ కూడా స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు. డిసెంబర్ లో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా షూటింగ్ లో ముందు ఎన్.టి.ఆర్ పాల్గొంటాడని తెలుస్తుంది.

ఇక సినిమా పనులు మొదలు పెట్టిన జక్కన్న ఎన్.టి.ఆర్ కోసం హాలీవుడ్ ఫిట్ నెస్ ట్రైనర్ ఎల్లాయిడ్ స్టీవెన్స్ ను రప్పించాడు. ఆల్రెడీ జై లవ కుశ నుండి అరవింద సమేత లోని ఎన్.టి.ఆర్ లుక్ కోసం తారక్ తో సిక్స్ ప్యాక్ చేయించిన స్టీవెన్స్ ఇప్పుడు మళ్లీ రాజమౌళి సినిమా కోసం ఎన్.టి.ఆర్ కు కొత్త మేకోవర్ తెచ్చే పనిలో ఉన్నాడట. తాజా సమాచారం ప్రకారం రాజమౌళి ఎన్టీఆర్ ని ఈ సినిమాలో ఒక సరికొత్త లుక్ లో అభిమానులకి చూపించనున్నాడని తెలుస్తుంది. ఎన్టీఆర్ పై జక్కన ప్రయోగాలు గురించి పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

త్వరలోనే ఈ వర్క్ షాప్ మొదలు పెడతారని తెలుస్తుంది. డివివి దానయ్య నిర్మించనున్న ఈ ట్రిపుల్ ఆర్ ప్రాజెక్ట్ 2020 సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.

Share.