మంచు ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన మంచు మనోజ్ మొదట్లో రాకింగ్ స్టార్ ఇమేజ్ సంపాదించినా తర్వాత తర్వాత అంత ప్రభావం చూపించలేకపోతున్నాడు. అడపాదడపా సినిమాలు చేస్తున్నా అవి వర్క్ అవుట్ కావడం లేదు. అందుకే మనోజ్ కాస్త గ్యాప్ తీసుకునే ఆలోచనలో ఉన్నాడు. ఈమధ్య కాస్త లావెక్కిన మంచు మనోజ్ అదేదో ఓ సినిమాలో పాత్ర కోసం అని చెప్పినా ఆ సినిమా అయ్యాక కూడా అదే విధంగా కనిపిస్తున్నాడు.
కెరియర్ అంత ఆశాజకంగా లేదు కాబట్టి కొత్తగా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడట మనోజ్. ఓసారి సినిమాలకు గుడ్ బై చెబుతున్నా అని ట్వీట్ చేసి హంగామా చేశాడు. అయితే మనోజ్ లేటెస్ట్ గా తాను కొన్నాళ్లు తిరుపతిలో తన మకాం మార్చుతున్నట్టు తెలిపాడు. తెలుస్తున్న సమాచారం ప్రకారం మంచు మనోజ్ రాజకీయాల్లోకి వస్తున్నారు అని టాక్. అందుకే అక్కడ నుండి కార్యచరణలు మొదలు పెట్టాలని చూస్తున్నారట.
ప్రపంచంలో అన్ని చోట్ల తిరిగాను.. చాలామందితో మాట్లాడాను.. అన్నిటికంటే తిరుపతిలో ప్రశాంతంగా ఉంటుందని అన్నారు మనోజ్. మరి మనోజ్ నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది త్వరలో తెలుస్తుంది. ఇక మంచు మనోజ్ తన ట్విట్టర్ ద్వారా ఒక లేక విడుదల చేసి ఈ విషయాలన్నింటిని ప్రస్తావించారు. ఇదే లేక చివర్లో నా జీవితం ఈ నెల యువతకి అంకితం అని చెప్పారు.
Meekosam Nenu 🙏🏻❤ pic.twitter.com/vSCVchVL37
— Manoj Kumar Manchu❤️ (@HeroManoj1) October 21, 2018