సంచలన ప్రకటన చేసిన ప్రముఖ నటి త్రిష, షాక్ లో ఫ్యాన్స్

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రముఖ నటి త్రిష కృష్ణన్ ఈ రోజు తన అధికారిక ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా ఒక షాకింగ్ ప్రకటన చేసారు. త్రిష ట్వీట్ చేస్తూ ” నా ట్విట్టర్ ఎకౌంట్ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేసారని అనుకుంటున్నా, నా ఇన్ బాక్స్ నుండి వచ్చే ఎటువంటి మెసేజెస్ కి రిప్లై చేయకండి ” అంటూ ట్వీట్ చేసారు .. ఈ ట్వీట్ చూసిన ఆమె ఫ్యాన్స్ ఒక్క సారిగా షాక్ కి గురైయ్యారు. వెంటనే ఆమెకి పలు సలహాలు ఇవ్వటం ప్రారంభించారు.

కొంత మంది నెటిజన్స్ త్రిష కి వెంటనే మీ పాస్ వర్డ్ చేంజ్ చేసుకోండని, మరి కొంత మంది మీ మొబైల్ ని ఫార్మాట్ చేసి కొత్త ట్విట్టర్ ఐడీ క్రియాట్ చేసుకోండి అంటూ ఆమెకి పలు సలహాలు ఇచ్చారు. త్రిష తాజాగా నటించిన చిత్రం ” 96 ” విడుదలైన అన్ని ప్రాంతాల్లో హిట్ టాక్ తో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో త్రిష నటనకి అన్ని వర్గాల ప్రజల ప్రశంసలు రావటం విశేషం.

Share.