బాలీవుడ్ లో మీటూ క్యాంపెయిన్ రోజు రోజుకి పెద్ద దుమారం రేపుతుంది. బీ టౌన్ లో సెన్సేషన్ గా మారిన మీటూ మూమెంట్ లో లేటెస్ట్ గా బిగ్ బాస్ మాజి కంటెస్టంట్ మోడల్ పూజా మిశ్రా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తనపై సల్మాన్ ఖాన్ అతని సోదరులు అర్భజ్, సొహైల్ ఖాన్ లు రేప్ చేశారని అన్నది.
మీటూ ఆరోపణలను ఎదుర్కుంటున్న వారిలో డైరెక్ట్ గా రేప్ చేశాడంటూ ఓ మోడల్ చెప్పడంతో సల్మాన్ ఖాన్ ఇబ్బందుల్లో పడ్డాడు. ప్రస్తుతం ఈ గొడవ ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి. అంతేకాదు బిజేపి నేత శత్రుజ్ఞ సిన్హా తన ఫోన్, ల్యాప్ టాప్ హ్యాక్ చేసి తన ఐడియాలను దొంగతనం చేశాడని ఆరోపించింది. అంతే కాకుండా సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ తనకి సినిమా అవకాశాలు రాకుండా చేసాడని ఆరోపించింది. మరో వీడియో లో నటుడు శత్రుజ్ఞ సిన్హా తన ల్యాప్ టాప్ లోని ముఖ్య సమాచారాన్ని, తన మార్కెటింగ్ ఐడియాలని హ్యాక్ చేసి తన కూతురు సోనాక్షి సిన్హా కెరీర్ కోసం ఉపయోగించాడని తెలిపింది.
ఇక పూజ మిశ్ర అధికారిక ఇన్ స్టాగ్రామ్ ఎకౌంట్ లో ఆమె వీరి పై చేసిన అనేక కామెంట్స్ ని పలు వీడియోస్ లో చూడవచ్చు.
ప్రస్తుతం పూజా మిశ్రా వ్యాఖ్యలు బాలీవుడ్ లో తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. మరి ఈ ఆరోపణలపై సల్మాన్ ఖాన్ అతని సోదరులు ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి.