ప్రిన్స్ మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా అరంగేట్రం చేసి తనకంటూ ఒక ప్రత్యకమైన గుర్తింపుని సంపాదించుకున్నారు. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు, కుటుంబ ప్రేక్షకులు మహేష్ బాబు ని అమితంగా ఇష్ట పడతారు. ఇక యూత్ లో కూడా మహేష్ బాబు కి మంచి క్రేజ్ ఉందనేది అందరికి తెలిసిందే.
ఇక తాజా సమాచారం ప్రకారం మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా త్వరలో తెలుగు వెండి తెరకి పరిచయం కాబోతున్నారట. అశోక్ గల్లా ప్రముఖ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు. గల్లా జయదేవ్ మహేష్ బాబు కి బావ అవుతారనే విషయం మనందరికీ తెలిసిందే. అశోక్ గల్లా తొలి చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన సొంత బ్యానర్ పై నిర్మిస్తున్నారని సమాచారం. ఈ సినిమాకి ” అదే నువ్వు అదే నేను ” అనే టైటిల్ ని కూడా రిజిస్టర్ చేసారని టాక్. అశోక్ గల్లా ఇటీవలే యూఎస్ఏ లోని ప్రముఖ యూనివర్సిటీ లో నటనలో శిక్షణ పొందారు.
హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న మహేష్ మేనల్లుడు అశోక్
Share.