నేనలాగే ఉంటా…అయితే నీకేంటి, నటి మాధవి లత ఫైర్

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రముఖ తెలుగు నటి మాధవి లత తాజగా జరిగిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొంది. అందులో దిగిన ఫొటోస్ ని సోషల్ మీడియా ద్వారా ఆమె షేర్ చేసుకున్నారు. అయితే ఆ ఫోటోలు చూసిన నెటిజన్స్ ఆమె చాల పొట్టిగా ఉందని విమర్శలు చేసారు. అనేక మంది ఇలా ఆమె పై కామెంట్స్ చేయటంతో మాధవి లత వారి పై పేస్ బుక్ లైవ్ లో విరుచుకు పడ్డారు.

మాధవిలత లైవ్ లో మాట్లాడుతూ ” అవునురా బై నేను పొట్టిగనే ఉంటా, నీకేమైనా నొప్పా? లేక ఎక్కడైనా నొప్పొచ్చిందా? నీకేమైనా మాయరోగం వచ్చిందా? నీకేమైనా పొయ్యేకాలం వచ్చిందా? లేదు కదా? ఒక వేళా వస్తే ఆసుపత్రి లో చూపించుకోండి.

మీ అమ్మ.. అక్కా.. మీ చెల్లి అంతా నా కంటే పొడవుగానే ఉన్నారు కదా, మరి ఇంకేంటి చాల హ్యాపీ గా ఉండు. నాకు లేనిది.. మీకున్నందుకు సంతోషించండి. నామీద పడి ఎందుకు ఏడుస్తారు? నేను పొట్టిగా ఉండటం వలన ఎవరికైనా నొప్పి వస్తే వెళ్లి హాస్పిటల్ లో చూపించండి, లేదంటే అది శాడిస్టిక్ డిసీజ్ అనే ఒక భయంకరమైన రోగం లాగా మారుతుంది. ఎవరైనా ఫోటో పెడితే ఫోటో నచ్చిందనో, లేక నచ్చలేదనో చెప్పాలి..అంతే. అవును నేను పొట్టిగా నల్లగా ఉంటా అయితే నీకేంటి, నచ్చితే ఉండు ఇష్టం లేకపోతే జస్ట్ గెట్ లాస్ట్ ఫ్రమ్ మై పేజ్..అంటూ తీవ్ర స్థాయిలో ఆమె పై కామెంట్స్ చేసిన వారి పై విరుచుకు పడ్డారు నటి మాధవి లత.

Share.