మెగాస్టార్ చిరంజీవి తో కిచ్చసుదీప్, ఫోటో వైరల్

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, నయనతార హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం ” సైరా నరసింహ రెడ్డి ” ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ చిరు కి గురువు పాత్రలో నటిస్తున్న సంగతి విదితమే. అమితాబ్ గోసాయి వెంకన్న గా ఈ సినిమాలో కనిపించనున్నారు. అలాగే ఈ సినిమాలో ప్రముఖ కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.
సుదీప్ ఈ సినిమాలో అవుకురాజా గా ప్రేక్షకులని అలరించనున్నారు. మరో స్టార్ హీరో విజయ్ సేతుపతి కూడా సైరా సినిమాలో కీలక పాత్ర చేయనున్నారు.

ఇక ఈ సందర్భంగా ఈ రోజు ట్విట్టర్ ద్వారా కిచ్చ సుదీప్ మెగాస్టార్ చిరంజీవి తో కలిసి ఉన్న ఫోటో ఒకటి షేర్ చేస్తూ ” చిరంజీవి గారి లాంటి లెజెండ్ తో కలిసి ఈ సినిమాలో నటించటం నిజంగా ఎంతో గర్వకారణం, షూటింగ్ సమయంలో చిరు సర్ నా మీద చూపించిన ప్రేమకి, అభిమానానికి కృతజ్ఞతలు. చిత్ర యూనిట్, దర్శకుడు సురేందర్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ సినిమాకి రామ్ చరణ్ ఒక పిల్లర్ లాగా నిలబడి సినిమాని తెరకెక్కించారు అని ట్వీట్ చేసారు.

Share.