తిత్లీ తుపాన్ బాధితులకు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ విరాళం

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల పై తిత్లీ తుపాన్ ఎంతగా ప్రభావం చూపిందో అందరికి తెలిసిందే. అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం రూ.2,800 కోట్ల మేర ఆస్థి నష్టం జరిగిందని తాజా సమాచారం. ఈ తుపాన్ కారణంగా రెండు జిల్లాలోని వనరులు తీవ్రంగా నష్టపోయాయి. ఈ ప్రాంతాల్లో అధికారులు ప్రస్తుతం సహాయక చర్యల్లో బిజీ గా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు, పలువురు నటులు ఇప్పటికే తిత్లీ తుఫాన్ బాధితులకు తమ వంతు సహాయంగా సిఎం సహాయ నిధికి విరాళాలు అందచేసారు.

ఇక తాజాగా టాలీవుడ్ నటులు నందమూరి కళ్యాణ్ రామ్ రూ 5 లక్షలు, ఎన్టీఆర్ రూ 15 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళంగా ఇచ్చారు.
నిన్న విజయ్ దేవరకొండ సిఎం రిలీఫ్ ఫండ్ కి 5లక్షల ఆర్ధిక సహాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే నటుడు సంపూర్ణేష్ బాబు రూ 50 , 000 ప్రకటించారు.

Share.