యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ” అరవింద సమేత వీర రాఘవ ” అక్టోబర్ 11 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా తొలి రోజే వరల్డ్ వైడ్ గా సుమారు రూ 60 కోట్ల గ్రాస్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా ఇప్పటికే 1.5 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించి 2 మిలియన్ డాలర్ల వైపు పరుగులు తీస్తుంది.
ఈ క్రమంలో ఎన్టీఆర్ దక్షిణాదిన ఈ హీరో సాధించలేని ఒక అరుదైన రికార్డు నెలకొల్పారు. ఎన్టీఆర్ గత చిత్రాలైన `నాన్నకు ప్రేమతో`, `జనతా గ్యారేజ్`, `జైలవకుశ` సినిమాలు కూడా ఓవర్సీస్ లో విడుదలై అక్కడ భారీ వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే. ఈ మూడు సినిమాలు కూడా అక్కడ 1.5 మిలియన్ డాలర్ల కలెక్షన్లను సాధించాయి, ఇక తాజాగా ఎన్టీఆర్, పూజ హేగ్దే నటించిన అరవింద సమేత కూడా 1.5 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసి రికార్డు క్రియేట్ చేసింది. దీంతో వరుసగా నాలుగు సార్లు ఓవర్సీస్లో 1.5 మిలియన్ డాలర్ల కలెక్షన్లు సాధించి సౌత్ లో మరే ఇతర హీరో సాధించలేని ఒక అరుదైన రికార్డు ఎన్టీఆర్ సృష్టించారు. దక్షిణాదిన ఈ ఘనత సాధించిన మొదటి హీరో ఎన్టీఆర్ కావటం విశేషం.