తిత్లీ బాధితులకి భారీ విరాళం ప్రకటించిన నటుడు సంపూర్ణేష్ బాబు

Google+ Pinterest LinkedIn Tumblr +

ఏపీ లో శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ పెను తుపాను సృష్టించిన నష్టం అందరికి తెలిసిందే. ప్రాథమిక అంచనా ప్రకారం రూ.2,800 కోట్ల మేర నష్టం జరిగిందని అధికారుల అంచనా. తాజాగా సిఎం చంద్ర బాబు తక్షణ సాయం కింద రూ. 1200 కోట్లు విడుదల చేయాలని ప్రధానికి లేక రాసారు.

టాలీవుడ్ హీరో సంపూర్ణేష్ బాబు ఈ రోజు తన అధికారిక ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా శ్రీకాకుళం జిల్లాలో జరిగిన తిత్లీ తుపాను బాధితులకు రూ 50,000 తక్షణ ఆర్ధిక సహాయం ప్రకటించారు. సంపూర్ణేష్ బాబు ట్వీట్ చేస్తూ ” తిత్లీ పెను తుపాను వల్ల శ్రీకాకుళం జిల్లాలో చాల నష్టం జరిగిందని స్నేహితుల ద్వారా తెలుసుకున్నాను. వెంటనే మన వంతు సాయంగా చర్యలు చేపట్టాలని అన్ని వర్గాల ప్రజలను కోరుకుంటున్నాను అని తెలిపారు.

ఇక నా వంతుగా రూ 50,000/- ఆర్థిక సాయం ముఖ్యమంత్రి గారి సహాయనిధికి త్వరలో అందజేస్తాను అని ట్వీట్ చేసారు. సంపూర్ణేష్ మార్గంలో మరి కొంత మంది తెలుగు అగ్ర కథానాయకులు కూడా తిత్లీ పెను తుపాను బాధితులకు తమ వంతు ఆర్ధిక సహాయం అందచేస్తారని కోరుకుందాం. హ్యాట్స్ ఆఫ్ టూ సంపూర్ణేష్ బాబు.

Share.