అరవింద సమేత పై మెగా హీరో సాయి ధరమ్ సంచలన కామెంట్స్

Google+ Pinterest LinkedIn Tumblr +

యంగ్ టైగర్ ఎన్టీఆర్, పూజ హేగ్దే జంటగా నటించిన చిత్రం ” అరవింద సమేత ” ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి మొదటి షో నుండే పాజిటివ్ టాక్ రావటంతో విడుదలైన అన్ని చోట్ల కలక్షన్ల ప్రభంజనం సృష్టిస్తుంది. మొదటి రోజే ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ 60 కోట్ల గ్రాస్ వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమాకి టాలీవుడ్ లోని ప్రముఖుల నుండి కూడా ప్రశంసలు రావటం విశేషం.

ఇక తాజాగా తొలి సారి ఈ సినిమా పై మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ట్విట్టర్ ద్వారా తన స్పందన తెలియ చేసారు. సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేస్తూ ” ఈ సినిమాలో ఎన్టీఆర్ చాల డెడికేషన్ తో నటించి తన బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఇక త్రివిక్రమ్ గారు తన సినిమా కథ పై పూర్తి నమ్మకంతో సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా ప్రొడ్యూసర్ కూడా ఎంతో కమిట్మెంట్ తో సినిమాని నిర్మించారు. అరవింద సమేత సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి నా కంగ్రాట్స్..ఎన్టీఆర్ నీ పట్ల నేను చాల సంతోషంగా ఉన్న.
జగపతి బాబు గురించి ట్వీట్ చేస్తూ ” సర్ మీరు నిజంగా బ్రిలియన్ట్, పూజ హేగ్దే మీరు ఈ సినిమాలో చాల అందంగా నటించారు అంటూ తన ట్వీట్ ని ముగించారు సాయి ధరమ్ తేజ్.

Share.