శాటిలైట్ రైట్స్ లో దుమ్ముదులిపేస్తున్న అరవింద సమేత..!

Google+ Pinterest LinkedIn Tumblr +

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రం కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ సినిమా అభిమానులనే కాదు సినిప్రియులను అలరిస్తుంది. ఈ సినిమా రిలీజ్ కు ముందు 20 కోట్ల దాకా శాటిలైట్ రైట్స్ డిమాండ్ చేయగా ఆఫ్టర్ రిలీజ్ మరో మూడున్నర కోట్లు పెరిగింది. స్టార్ మా, జీ తెలుగు ఛానెల్స్ పోటీ పడి పడిన అరవింద సమేత శాటిలైట్ రైట్స్ లో జీ తెలుగు 23.5 కోట్లు పెట్టి ఈ సినిమా శాటిలైట్స్ దక్కించుకుందట.

ఎన్.టి.ఆర్, త్రివిక్రం కాంబినేషన్ లో సినిమా ఎలాంటి అంచనాలు ఉండాలో వాటికి తగినట్టుగా ఉంది ఈ సినిమా. ఓవర్సీస్ లో మిలియన్ మార్క్ దాటేసిన ఈ సినిమా తెలుగు రెండు రాష్ట్రాల్లో 27 కోట్ల షేర్ రాబట్టడం విశేషం. మొత్తంగా ఎన్.టి.ఆర్ సత్తా చాటేలా అటు కలక్షన్స్ తో పాటుగా శాటిలైట్ రైట్స్ లో కూడా దుమ్ముదులిపేస్తుంది అరవింద సమేత.

Share.