ఆస్ట్రేలియా లో విధ్వంసం సృష్టిస్తున్న అరవింద సమేత

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎన్టీఆర్ హీరోగా పూజ హేగ్దే హీరోయిన్ గా నటించిన చిత్రం అరవింద సమేత నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే విడుదలైన అన్ని ప్రాంతాల్లో పాజిటివ్ టాక్ రావటంతో కలెక్షన్లు భారీ స్థాయిలో రావటం విశేషం. ఇప్పటికే అనేక సెంటర్స్ లో నాన్ బాహుబలి రికార్డులని ఈ సినిమా బ్రేక్ చేసింది. యూఎస్ఏ లో ఆల్రెడీ 1 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసి 2 మిలియన్ డాలర్స్ వైపు ఈ సినిమా పరుగులు పెడుతుంది.

ఇక సాధారణముగా ఆస్ట్రేలియా లో మన తెలుగు సినిమాలు చాల తక్కువ లొకేషన్స్ లో విడుదల అవుతూ ఉంటాయి. అది కూడా స్టార్ హీరోలా సినిమాలు మాత్రమే. ఇక నిన్న ఆస్ట్రేలియా లో అరవింద సమేత సుమారు 35 లొకేషన్స్ లో విడుదలై 128,740 ఆస్ట్రేలియన్ డాలర్స్ , అంటే మన కరెన్సీ లో రూ 67.63 లక్షలు కలెక్ట్ చేసిందని ప్రముఖ మూవీ క్రిటిక్ తరన్ ఆదర్శ్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. కలక్షన్ల పరంగా ఆస్ట్రేలియా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా టాప్ 9 లోకి దూసుకు రావటం విశేషం. ఈ వీకెండ్ ముగిసే సరికి ఆస్ట్రేలియా లో కూడా ఈ సినిమా మరి కొన్ని రికార్డ్స్ సొంతం చేసుకోవటం ఖాయమని తెలుస్తుంది.
ఇక ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సినిమా తొలి రోజు రూ26 .75 కోట్లు (షేర్) సాధించింది.

బ్రేకింగ్ న్యూస్ : తాజా సమాచారం ప్రకారం అరవింద సమేత తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ 60 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని సమాచారం.

Share.