యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ” అరవింద సమేత వీర రాఘవ ” నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. ఇక ఈ సినిమా యూఎస్ఏ లో ఈ సినిమా కేవలం ప్రీమియర్ షోస్ ద్వారానే సుమారు 7 ,00 ,000 డాలర్లు వసూలు చేసి ఎన్టీఆర్ కెరీర్ లోనే హైయెస్ట్ కలక్షన్లని సాధించిన సినిమాగా నిలిచింది.
ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా భారీ స్థాయిలో వసూలు చేసిందని సమాచారం. అరవింద సమేత తొలి రోజు నైజం లో రూ 8 .30 కోట్ల గ్రాస్ రూ 5 . 73 కోట్ల షేర్ కలెక్ట్ చేసిందని ట్రేడ్ విశ్లేషకుల సమాచారం.
ఏరియా వైజ్ కలక్షన్స్: ( షేర్ )
నైజాం 5.73 కోట్లు
సీడెడ్ రూ 5.3 కోట్లు
గుంటూరు రూ 4.14 కోట్లు
కృష్ణ రూ 2.08 కోట్లు
నెల్లూరు రూ 1.06 కోట్లు
యూఏ రూ 3 .12 కోట్లు
ఈస్ట్ రూ 2.78 కోట్లు
వెస్ట్ రూ 2.37 కోట్లు
టోటల్ ఏపీ, తెలంగాణ షేర్ రూ 26.75 కోట్లు
బ్రేకింగ్ న్యూస్ : తాజా సమాచారం ప్రకారం అరవింద సమేత తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ 60 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని సమాచారం.