తెలుగు ప్రజల ఆరాధ్య దైవం శ్రీ నందమూరి తారక రామారావు గారి బయోపిక్ అనౌన్స్ చేసినప్పటి నుండి ఈ సినిమా పై అంచనాలు భారీగా మొదలయ్యాయి. ఇక ఈ సినిమా లో లీడ్ రోల్ లో బాలకృష్ణ నటిస్తున్నారని వార్త తెలియగానే అభిమానుల ఆనందానికి అంతే లేదు.
ఇక ఈ రోజు చిత్ర యూనిట్ ఎన్టీఆర్ సినిమాలో బాలయ్య ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు. ఎన్టీఆర్ బయోపిక్ కి ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేయాలని క్రిష్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. వచ్చే సంక్రాంతికి ఎన్టీఆర్ బయోపిక్ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ఆలోచనలో చిత్ర బృందం ఉందని సమాచారం. ఈ ఫస్ట్ లుక్ లో బాలయ్య వయసు సగానికి సగం తగ్గినట్టు కనిపించేలా చేసారు దర్శకుడు. ఈ సినిమాలో బాలయ్య అభిమానులని ఎంత వరకు అలరిస్తారో తెలియాలంటే వచ్చే సంక్రాంతి వరకు ఆగాల్సిందే.
‘ఎన్టీఆర్’ బయోపిక్ ఫస్ట్ లుక్
Share.