మెగా స్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ” సైరా నరసింహ రెడ్డి ” , ప్రముఖ స్వతంత్ర సమారా యోధుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా చిత్రీకరిస్తున్నారు దర్శకుడు సురేందర్ రెడ్డి. నయనతార ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించనుంది. ఇక ఈ సినిమాలో చిరంజీవి కి గురువుగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటించనున్నారు. ఈ సినిమాలో ప్రముఖ కన్నడ నటుడు సుదీప్ ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. సుదీప్ ఈ సినిమాలో అభినయ చక్రవర్తి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసందే.
ఈ రోజు అమితాబ్ బచ్చన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాలోని రాజా గురువు ” గోసాయి వెంకన్న ” లుక్ ని విడుదల చేసారు. నిజంగా అమితాబ్ గారు ఈ లుక్ లో రాజగురువు అన్న పదానికే వన్నె తెచ్చారు అని చెప్పవచ్చు. ఇక ఈ మోషన్ పోస్టర్ కి అమిత్ త్రివేది ఇచ్చిన సంగీతం కూడా ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది. కొణిదెల సురేఖ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.