అక్కడ చేతులు పెట్టి అసభ్యకరంగా ప్రవర్తించారు, స్టార్ సింగర్ చిన్మయి సంచలన ట్వీట్

Google+ Pinterest LinkedIn Tumblr +

స్టార్ సింగర్ చిన్మయి శ్రీపాద తన అఫీషియల్ ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా గత కొన్ని రోజుల నుండి బాల్యంలో తనకి జరిగిన కొన్ని సంఘటలను షేర్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో తను శ్రీ దత్త ఉదంతంతో ప్రతి ఒక్క మహిళా తమపై జరిగిన పలు దాడులను ప్రస్తావిస్తూ ” #మీ టూ మూవ్ మెంట్ ” ( పని చేసే ప్రదేశంలో జరిగే సెక్సువల్ హరాస్మెంట్ కి వ్యతిరేకంగా గళం విప్పటం ) లో తమకు పని చేసే చోట ఎదురైనా కొన్ని చేదు అనుభవాలను పంచుకున్నారు.

ఇక ఈ ” #మీ టూ మూవ్ మెంట్ ” లో భాగంగా స్టార్ సింగర్ చిన్మయి శ్రీపాద కూడా తన ట్విట్టర్ ద్వారా ” బాల్యంలో ఒకసారి నేను సైకిల్ పై వెళ్తుండగా కొంత మంది ఈవ్ టీజింగ్ చేయటంతో సైకిల్ పై నుండి పడిపోయాను, అప్పుడు నా కుడి చేతికి బాగా గాయాలు అయ్యాయి…ఇక నా బాల్యంలో కొంత మంది వ్యక్తులు నా షర్ట్ పాకెట్ లో చేతులు పెట్టి అందులో ఏమైనా ఉందేమో అని వెతికేవారు, ఆ విధంగా నా చెస్ట్ ని వారు తాకేవారు ” అంటూ సింగర్ చిన్మయి షాకింగ్ కామెంట్స్ చేసారు.

అంతే కాకుండా తనకి సుమారు పదకొండు సంవత్సరాల వయసులో డిసెంబర్ లో జరిగిన ఒక మ్యూజిక్ ఈవెంట్ లో తన బంధువొకరు ( పేరు సరిగా గుర్తు లేదు ) షో జరుగుతున్నంత సేపు నా తొడలని గిచ్చుతూనే ఉన్నారు అని ట్వీట్ చేసారు. ప్రస్తుతం చిన్మయి చేసిన ఈ ట్వీట్స్ నెట్ లో వైరల్ గా మారాయి.
చిన్మయి మన తెలుగు నటుడు రాహుల్ రవీంద్రన్ ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

Share.