ప్రతుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయిన తను శ్రీ దత్త కామెంట్స్ కు ఆమె లీక్ చేసిన వీడియో మరింత బలాన్ని చేకూర్చింది. ప్రముఖ నటుడు నానా పటేకర్ ఓ సినిమా షూటింగ్ లో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని కామెంట్ చేసిన తను శ్రీ ఆ కామెంట్స్ తర్వాత తన మీద నా పటేకర్ చేయించిన దాడిని వీడియో ద్వారా లీక్ చేసింది. 2008 లో తన మీద జరిగిన దాడిని వీడియో ద్వారా లీక్ చేసింది తను శ్రీ.
ఈ వీడియోలో నానా పటేకర్ ఫ్యాన్స్ తను శ్రీ కారుని చుట్టుముట్టారు. అంతేకాదు దుర్భాషలాడుతూ ఆమెని ఇబ్బంది పెట్టారు. అయితే నానా పటేకర్ మాత్రం తను శ్రీపై రివర్స్ గా కేసు పెట్టడం జరిగింది. హీరోయిన్ గా కెరియర్ కు ఫుల్ స్టాప్ పెట్టేసిన తను శ్రీ దత్తా లేటెస్ట్ గా కాస్టింగ్ కౌచ్ మీద పెద్ద యుద్ధమే చేస్తుంది. బాలీవుడ్ లో కూడా తను శ్రీకి సపోర్ట్ గా కొందరు మాట్లాడుతుంటే మరికొందరు మాత్రం ఆమెకు వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు.