పైరసీ అనే రోగం బాగా వ్యాపించి పోతోంది. ధియేటర్ కి వెళ్లి సినిమా చూసేవారి సంఖ్య రోజురోజుకి తగ్గిపోతోంది. అప్పుడంతా కొత్త టెక్నాలజీ కంప్యూటర్లు, ఫోనుల్లోనే హాయిగా ఫైరసీ సినిమా చూసేస్తున్నారు. దీనికోసం ఆన్లైన్ లో చాలా వెబ్సైట్లు ఉన్నాయి. సినిమా రిలీజ్ అయితే పాపం వెంటనే ఆన్లైన్ లో ఆ సినిమా కు సంబంధించి డౌన్లోడ్ లింక్ ప్రత్యక్షం అయిపోతోంది. ఇంకేముంది ఎటు కదలకుండా హాయిగా సినిమా చూసే అవకాశం ప్రజలకి లభిస్తోంది. దీంతో పైరసీ మార్కెట్ వ్యాపారం జోరుగా సాగిపోతోంది.
ఈ సినిమా పైరసీ వల్ల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యజమానులు చాలా నష్టపోతున్నారు. ప్రేక్షకుడికి మంచి అనుభూతిని ఇవ్వాలని ఎంతో శ్రమించి, డబ్బులు పోగు చేసుకుని ఖర్చు పెడుతుంటారు నిర్మాతలు కానీ ఈ పైరసీ వలన వారు ఆర్ధికంగా చాలా నష్టపోతున్నారు. సినిమా బాగుంది, కానీ పైరసీ వచ్చేసింది ఏంటి సర్ మా పరిస్థితి’ అంటూ .. ఎగ్జిబిటర్లు బిక్కమొఖం వేస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం రిలీజ్ అయిన దేవదాస్ – నవాబ్ చిత్రాల టొరెంట్లు అప్పుడే ఆన్లైన్ లో అందుబాటులోకి వచ్చేసాయి. ఈ రెండు చిత్రాలు పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్నాయి. ఈ వార్త తెలుసుకున్న చిత్ర నిర్మాతలు షాక్ కి గురైయ్యారు. అరవిందస్వామి – శింబు – జ్యోతిక వంటి బిగ్ స్టార్స్ తో మణిరత్నం అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారని ప్రశంసలు వస్తున్నాయి. ఇక నాగార్జున- నాని కాంబినేషన్ లో శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన `దేవదాస్ చిత్రం కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. అయితే ఆ ఆనందం మాత్రం నిర్మాతలకు దక్కకుండా పోతోంది. దీనికి కారణం ఫైరసీ. దీన్ని పూర్తిస్థాయిలో అరికట్టకపోతే ఇక ముందు ముందు సినిమాలు తీసేందుకు నిర్మాతలు వెనకడుగు వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సామాన్య సినిమా ప్రేక్షకుడు కూడా ఈ పైరసీ భూతాన్ని అంతం చేయటంలో తమ వంతు సహకారం అందించాలి.