ఎన్టీఆర్ బయోపిక్ లో ఏఎన్ఆర్ కు అన్యాయం?

Google+ Pinterest LinkedIn Tumblr +

నందమూరి బాలకృష్ణ నిర్మిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ పై అందరికి ఆసక్తి పెరిగిపోతోంది. ఈ సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలు పెంచుతోంది. ఎన్టీఆర్‌లా బాలయ్య లుక్ ఒకటి విడుదల కావడం, ఆ తర్వాత ప్రముఖుల లుక్స్ ఒక్కొక్కటిగా విడుదల అవుతూ.. సినిమాపై ఆసక్తిని పెంచుతూ వస్తున్నాయి. ఏఎన్నార్ ఫస్ట్‌లుక్ కూడా సినిమాపై హైప్‌ను మరింత పెంచుతోంది. ఈ సినిమాలో ఏఎన్నార్ పాత్రను ఆయన మనవళ్లలో ఒకరైన సుమంత్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్టిల్‌లో తాతగారిని పోలికలతో సుమంత్ ఆకట్టుకుంటున్నాడు.

ఈ బయోపిక్ లో ఏఎన్నార్ పాత్ర చాలా వరకు ఉంటుందని అందరూ అంచనా వేశారు. దీనికి కారణం మొన్నీ మధ్య వచ్చిన ‘మహానటి’ సినిమానే కారణం. ఆ సినిమాలో నాగేశ్వరావు పాత్రలో నాగచైతన్య కనిపించాడు. ఈ సినిమాలో ఏఎన్నార్ పాత్ర చాలా సేపు ఉంటుంది. సావిత్రి- ఏఎన్నార్ నటించిన అనేక సినిమా సీన్లు మహానటిలో చూపించారు.
కానీ ఎన్టీఆర్ బయోపిక్ లో మాత్రం మహానటి సినిమాలో ఉన్నంత నిడివి లేదని, కేవలం కొన్ని చిన్న చిన్న సీన్లకే ఏఎన్నార్ పాత్ర పరిమితం చేసినట్టు తెలుస్తోంది.

ఎన్టీఆర్ బయోపిక్ లో ఏఎన్నార్ కు దక్కింది కేవలం మూడు సన్నివేశాలే అని తెలుస్తోంది. అది కూడా కేవలం మొక్కుబడిగా మాత్రమేనని, ఎన్టీఆర్- ఏఎన్నార్ మంచి మిత్రులు కావడంతో వారిద్దరూ సన్నిహితంగా ఉన్న సీన్లను పెట్టారని సమాచారం. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేముందు వారిద్దరి మధ్య చోటు చేసుకున్న పరిణామాలను ఇందులో చూపించబోతున్నారట.

Share.