నటి సమంత ప్రస్తుతం వరుస విజయాలతో చాల సంతోషంగా ఉన్నారు. రంగస్థలం, మహానటి, అభిమన్యుడు ఆమె కెరీర్ కి కొత్త ఉత్సాహానిచ్చాయి. ఇక తాజాగా రిలీజ్ అయినా యూ టర్న్ సినిమా లో సమంత నటనకి విమర్శకులు సైతం ఆమె పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇలా వరుస సినిమాలతో బిజీ గా ఉన్న సమంత ప్రస్తుతం చైతు తో కలిసి హాలిడే కి వెళ్లారు. అక్కడ తీయించుకున్న ఓ ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు. మొన్న ఒక పబ్ లో చైతన్య అక్కినేని ని ముద్దాడుతూ కనిపించిన సమంత, తాజా ఫోటో లో ఒక రెడ్ కలర్ డ్రెస్ లో దర్శనమిచ్చారు. ప్రస్తుతం సమంత ఫోటోలు నెట్ లో వైరల్ గా మారాయ్.
ఇక ఈ ఫోటో కి సమంత ” చైతు నన్ను చాల అరుదుగా ఫోటో తీస్తాను ఒక్క క్షణం ఆగు అని అడుగుతాడు, ఆలా చైతు తీసిన ఫోటోలలో ఇది కూడా ఒకటి ” అని సరదాగా కామెంట్ చేసారు సమంత. నాగ చైతన్య తాజా చిత్రం ” శైలజ రెడ్డి అల్లుడు ” కూడా రెండు వారల క్రితం విడుదలై అన్ని ప్రాంతాలలో మంచి వసూళ్ళని రాబట్టిన విషయం తెలిసిందే.