యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం తేజ దర్శకత్వంలో నూతన చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. తొలి సారి కాజల్ ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ తో జోడి కట్టనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ థాయ్ ల్యాండ్ లో జరుగుతుంది. ఇటీవలే హీరో బెల్లంకొండ షూటింగ్ లో కాజల్ మరియు డైరెక్టర్ తేజ తో ఉన్న ఫోటోలని షేర్ చేసుకున్నారు. ఇక నిన్న తాజాగా సోషల్ మీడియా లో బెల్లంకొండ థాయిలాండ్ లో ఏనుగు దంతం పై కూర్చున్న ఫోటో ఒకటి తన ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు.
ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియా లో వైరల్ గా మారటమే కాకుండా, అనేక విమర్శలకి దారి తీసింది. వివాదానికి ప్రధాన కారణం బెల్లంకొండ శ్రీనివాస్ ఏనుగు దంతం పై కూర్చోవటమే…ఈ ఫోటో చూసిన ప్రతి ఒక్కరు ఒక నోరు లేని ముగా జీవి దంతాల పై కూర్చోవటం ఏంటని..ఇది ఆ ఏనుగుని తీవ్రంగా హింసించటమే అని వారు ఫైర్ అయ్యారు. ఇలా ట్రోలింగ్ మొదలైన కొద్దీ సేపటి తర్వాత విషయం తెలుసుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ ఆ ఫోటోని తన ట్విట్టర్ ఎకౌంట్ నుండి తొలగించారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇక ఈ వివాదం ఇంతటితో ముగిసి పోతుందో లేదో తెలియాలంటే కొద్దీ రోజులు వేచి చూడాల్సిందే.