ఎన్.టి.ఆర్ బయోపిక్ గా బాలకృష్ణ చేస్తున్న ఎన్.టి.ఆర్ మూవీ నుండి లేటెస్ట్ అప్డేట్ సిని లవర్స్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది. క్రిష్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా కాస్టింగ్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవడం లేదు బాలకృష్ణ. ఇప్పటికే రానా, సుమంత్, కళ్యాణ్ రాం లు ఈ ప్రాజెక్ట్ లో భాగస్వామ్యులుగా అవుతుండగా తాజాగా మళయాళ భామ నిత్యా మీనన్ ను ఈ సినిమా కోసం సెలెక్ట్ చేశారట.
అది కూడా మహానటి సావిత్రి రోల్ కోసం నిత్యా మీనన్ ను ఓకే చేసినట్టు తెలుస్తుంది. ఈమధ్య వచ్చిన మహానటి సినిమాలో కీర్తి సురేష్ అద్భుతంగా నటించింది. మహానటిగా కీర్తి సురేష్ పర్ఫెక్ట్ అనిపించుకుంది. అయితే ఆ సినిమా ఆఫర్ కూడా ముందు నిత్యా మీనన్ కు వచ్చింది. తాను కాదన్న తర్వాతే కీర్తి దగ్గరకు వెళ్లింది. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ బయోపిక్ లో సావిత్రి రోల్ కోసం కీర్తిని అడిగితే కాదన్నదట.
అందుకే మొదట అనుకున్న నిత్యా మీనన్ ను ఫైనల్ చేశారట. దర్శకుడు క్రిష్ కాబట్టి మహానటి సినిమాలో అతను కూడా నటించాడు కాబట్టి నిత్యా మీనన్ ను మహానటిగా అద్భుతంగా చూపిస్తాడని ఆశిస్తున్నారు. మరి మహానటి కీర్తి, నిత్యా ఇద్దరిలో ఎవరికి ఎక్కువ మార్కులు పడతాయో చూడాలి. కీర్తి ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంది కాబట్టి నిత్యా ఆ రేంజ్ అలరిస్తుందో అంతకుమించి చేస్తుందో చూడాలి.