ఆసియా కప్ లో అద్భుతం, భారత జాతీయ గీతాన్ని పాడుతున్నపాకిస్థాన్ క్రికెట్ అభిమాని, వీడియో వైరల్

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆసియా కప్ లో భాగంగా బుధవారం జరిగిన ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ లో భారత్ 8 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. పాకిస్థాన్ ఇచ్చిన 162 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 29 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో తాజాగా ఒక ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది.
సాధారణంగా మ్యాచ్ మొదలవకముందు ఇరు జట్లు తమ జాతీయ గీతాన్ని పాడతారు.
భారత్ జాతీయ గీతం స్టేడియం లో పాడుతుండగా మన ఆటగాళ్లతో పాటు పాకిస్థాన్ కు చెందిన ఒక క్రికెట్ అభిమాని కూడా మన దేశ జాతీయ గీతాన్ని పాడారు. ఈ విధంగా శాంతి మార్గాన్ని చాటిన ఈ పాక్ క్రికెట్ అభిమాని పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తుంది. ఈ వీడియో కేవలం కొన్ని గంటల్లోనే పేస్ బుక్ లో 10000 షేర్లు సాధించటం విశేషం.

Share.