నోటా విడుదల పై షాకింగ్ ప్రకటన చేసిన హీరో విజయ్ దేవరకొండ

Google+ Pinterest LinkedIn Tumblr +

విజయ్ దేవరకొండ హీరోగా కోలీవుడ్ క్రేజీ డైరక్టర్ ఆనంద్ శంకర్ డైరక్షన్ లో వస్తున్నమూవీ ” నోటా “, మెహ్రీన్ కౌర్ ఈ సినిమాలో ఒక మీడియా రిపోర్టర్ పాత్రలో నటించగా, విజయ్ పొలిటికల్ లీడర్ రోల్ లో కనిపించనున్నారు. ఈ సినిమాకి శశాంక్ వెన్నెలకంటి మాటలు రాసారు, అయితే తనకు రావాల్సిన రెమ్యూనరేషన్ ఇంకా ఇవ్వలేదని తాజాగా వెల్లడించారు శశాంక్. తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోతే సినిమా విడుదల ఆపివేస్తానని హెచ్చరించారు. ఈ కారణంతో నోటా విడుదల తేదీ పై అనేక ఊహాగానాలు ఇండస్ట్రీ లో వినిపిస్తున్నాయ్.

ఇక తాజాగా హీరో విజయ్ దేవరకొండ నోటా విడుదల తేదీ పై ఒక క్లారిటీ ఇచ్చారు. తన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేస్తూ ” ఇది చాల ముఖ్యమైన విషయం, ఒక సినిమా విడుదల చేయటానికి మంచి రోజులు ఉన్నట్ట్టే, చెడ్డ రోజులు కూడా ఉంటాయి. నోటా సినిమా విడుదల తేదీ పై చాల డ్రామా నడుస్తుంది. కావునా మిరే నా తదుపరి చిత్రం ఎప్పుడు విడుదల చేయాలో ఒక డేట్ ని నిర్ణయించండి, అక్టోబర్ 5 , 10 , 18 , నన్ అఫ్ ది ఎబోవ్ ఈ డేట్స్ లో ” నోటా ” ఎప్పుడు విడుదల చేయాలో మిరే ఓట్ చేయండి. ఓటింగ్ ద్వారా వచ్చిన రిజల్ట్ ని బట్టి రేపు విడుదల తేదీ ప్రకటిస్తాం ” అని ట్వీట్ చేసారు హీరో విజయ్.

Share.