భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సినిమాల్లో నటించనున్నాడని తన అఫీషియల్ ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా కోహ్లీనే స్వయంగా వెల్లడించారు. సుమారు 10 సంవత్సరాల తర్వాత మళ్లీ సినిమాల్లో నటిస్తున్న అని తెలిపారు. ఇక ఈ మూవీ టైటిల్ ” ట్రైలర్ ” అని ఖరారు చేసారు. ట్రైలర్ సినిమా ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసారు విరాట్.
ఈ సినిమా టీజర్ ని సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్టు పోస్టర్ లో వెల్లడించారు. విరాట్ సతీమణి బాలీవుడ్ హీరోయిన్ అనుష్క షర్మ నుండి స్ఫూర్తి పొందాడో ఏమో విరాట్ ఈ విధంగా సినిమాలో నటించటం తన ఫ్యాన్స్ కి కొత్త ఉత్సాహాన్ని ఇవ్వనుంది.
విరాట్ కోహ్లీ సొంత నిర్మాణ సంస్థ ” రాంగ్ ప్రొడక్షన్స్ ” బ్యానర్ లో ” ట్రైలర్ ” మూవీ తెరకెక్కనుంది. ఇక ఈ సినిమాలోని ఇతర నటీనటుల వివరాలు టీజర్ లాంచ్ రోజున తెలపనున్నారు చిత్ర యూనిట్ సభ్యులు.
Another debut after 10 years, can't wait! 😀 #TrailerTheMovie https://t.co/zDgE4JrdDT pic.twitter.com/hvcovMtfAV
— Virat Kohli (@imVkohli) September 21, 2018