నటి తాప్సి తాజాగా నటించిన బాలీవుడ్ చిత్రం ” మన్మార్ జియాన్ ” గత వారం ప్రేక్షకుల ముందుకి వచ్చింది. విక్కీ కౌశల్, అభిషేక్ బచ్చన్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులో తాప్సి ఒక పంజాబీ యువతీ గా నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాప్సి ట్విట్టర్ ద్వారా అభిమానులతో ముచ్చటించారు. ట్విట్టర్ లో కొంత మంది అడిగిన ప్రశ్నలకి ఆమె ఆశ్చర్యకర సమాధానాలు చెప్పారు.
ఒక అభిమాని తాప్సిని ” నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడిగితే…దానికి తాప్సి “కానీ ఒక షరతు, మనం గురుద్వారా లో పెళ్లి చేసుకుంటే, ప్రజలు ఎటువంటి గొడవ, ఆందోళన చేయకుండా నువ్వు చూసుకోవాలి” అని సమాధానం చెప్పారు.
ఇక మరో అభిమాని ” నాకు రేపు ఆఫీస్ లేదు, మనం డేట్ కి పోదాం ” అని అడిగారు.. దానికి తాప్సి ” సారీ మా కులం లో అది కుదరదు, పెళ్లి కి ముందు వేరొకరితో బయటికి రాలేను…మా కుల పెద్దల నుండి అంగీకారం తీసుకోండి, లేకపోతే వారు ఇది కూడా గమనిస్తూనే ఉంటారు ” అని బోల్డ్ గా సమాధానం చెప్పారు.
Only if u r sure people will not protest when we get married in a gurudwara and I might be thinking about my past at a given moment. https://t.co/zw3QaFqOga
— taapsee pannu (@taapsee) September 20, 2018
Sorry that is not allowed in my religion. Can’t date before marriage. Take permission from the religious army before u even THINK of such a thing Coz apparently there is a check on that too 🤐 https://t.co/uEnEEW5uT1
— taapsee pannu (@taapsee) September 20, 2018