టాలీవుడ్ లో ప్రస్తుతం బియోపిక్స్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే, కొద్దీ నెలల క్రితం విడుదలైన మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ” మహానటి ” ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే. ఇక ఇప్పుడు వైస్సార్ బయోపిక్ ” యాత్ర ” మరియు సీనియర్ ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ” ఎన్టీఆర్ ” త్వరలో ప్రేక్షకుల ముందుకి రానున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయ్. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే సంవత్సరం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి రానుంది.
ఇక ఈ రోజు ఈ చిత్రంలోని ఏఎన్ఆర్ పాత్రను పోషిస్తున్న అక్కినేని సుమంత్ ఫస్ట్ లుక్ ని ఏఎన్ఆర్ 94 వ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసారు. సుమంత్ లుక్ చూస్తుంటే అచ్చు ఏఎన్ఆర్ లానే ఉండటం విశేషం. ఇప్పటికే బాల కృష్ణ, రానా ఫస్ట్ లుక్ విడుదల చేసిన విషయం తెలిసిందే.