ప్రణయ్ హత్య పై రామ్ చరణ్ సంచలన వ్యాఖ్యలు

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రణయ్ దారుణ హత్య రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరిని కదలించిన విషయం తెలిసిందే. సామాన్యుల నుండి సెలబ్రిటీస్ వరకు ప్రతి ఒక్కరు ఈ ఉదంతం పై స్పందిస్తున్నారు. మొన్న హీరోలు రామ్, మనోజ్ ఈ విషయం పై తమ అభిప్రాయం తెలిపారు. అమృత తన సోషల్ మీడియా యకౌంట్స్ ద్వారా `జస్టిస్ ఫర్ ప్రణయ్`పేరుతో ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేయగా దానికి అన్ని వైపులా నుండి సపోర్ట్ లభించింది.

ఇక నిన్న నటుడు రామ్ చరణ్ తన అధికారిక పేస్ బుక్ ద్వారా ఈ క్యాంపెయిన్ కు తన మద్దతు ప్రకటించారు. ప్రణయ్ హత్యను తీవ్రంగా ఖండిస్తూ ఒక మెసేజ్ పెట్టారు చరణ్, ఒక వ్యక్తి ప్రాణం తీయడంలో పరువు ఎక్కడ ఉందని చెర్రీ ప్రశ్నించాడు. సమాజంలో మనుషులుగా మనం ఎటు వెళ్తున్నామని…ఇటువంటి ఘటనలు జరగడం చాల బాధాకరం, అమృత వర్షిణి, ప్రణయ్ కుటుంబాలకు నా సానుభూతి..ప్రణయ్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్న అని తెలిపారు రామ్ చరణ్. ఇక ఇదే మెసేజ్ ను ఉపాసన తన ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ ఇది చాల బాధాకరమైన సంఘటన అని తెలిపారు.

Share.