దేవదాస్ సినిమా ఆడియా పార్టీ (లాంఛ్) సెప్టెంబర్ 20న జరగనుంది. హైదరాబాద్ లో ఈ ఈవెంట్ ను భారీగా ప్లాన్ చేసారు దర్శక నిర్మాతలు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే అద్భుతమైన స్పందన అందుకుంటున్నాయి. ప్రత్యేకంగా వినాయకచవితి నాడు విడుదలైన లక లక లంకుమికరా పాటకు రెస్పాన్స్ అద్భుతంగా వస్తుంది. ఇక సెప్టెంబర్ 17న నాగార్జున, నాని సినిమాలో తమకు జోడీగా నటించిన హీరోయిన్లు ఆకాంక్ష సింగ్, రష్మిక మందన్నల పాత్రలు.. వాళ్ల పేర్లను వాళ్ల వాళ్ల ట్విట్టర్ లో విడుదల చేసి ప్రేక్షకులకు పరిచయం చేసారు. శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ లో నరేష్ వికే, రావు రమేష్, వెన్నెల కిషోర్, అవసరాల శ్రీనివాస్ తదితరులు నటిస్తున్నారు.
ఇక ఇదే రోజున యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న ‘ అరవింద సమేత వీర రాఘవ ‘ ఆడియో కూడా విడుదల కానుంది. పూజ హేగ్దే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్వరాలు అందించారు. సెప్టెంబర్ 20 వ తేదీ టాలీవుడ్ సినీ ప్రియులకి నిజంగా పండుగ రోజే అని చెప్పాలి. ముందుగా కొన్ని కారణాల వలన అరవింద సమేత ఆడియో క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందని పలు వార్తలు వినిపించాయి, కానీ ఫ్యాన్స్ కోసం ఆడియో వేడుక జరపనున్నారని తెలిసింది. ఈ న్యూస్ అక్కినేని, నందమూరి ఫ్యాన్స్ కి పెద్ద సర్ ప్రైజ్ అని చెప్పాలి.