టాలీవుడ్ స్టార్ కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి పేరుతో మరో వ్యక్తి నకిలీ ఫేస్‌బుక్ ఖాతా సృష్టించి, సినిమా కథలు చెప్పాలని సినిమా అవకాశాలు ఇప్పిస్తానని కొంత మందిని మోసం చేసాడు. దీని వలన శ్రీనివాస్ రెడ్డి కి సినీ ఇండస్ట్రీ లో చెడ్డ పేరు వస్తుందని అయన పోలీసులకి జరిగిందంతా వివరించారు. సైబర్ క్రైమ్ పోలీసుల విచారణలో అమీర్‌పేట ప్రాంతంలోని ఓ బస్తీకి చెందిన రవికిరణ్ ఇదంతా చేస్తున్నాడని తెలిసింది. గతంలో రవి కిరణ్ కొన్నేళ్ల పాటు పలువురు డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్ గా పని చేసారు. ఆ పరిచయాలను అడ్డం పెట్టుకుని కొంత మంది ప్రముఖుల నకిలీ పేస్ బుక్ అకౌంట్స్ సృష్టించి మోసం చేసే వాడు. ఈ క్రమంలో శ్రీనివాస్ రెడ్డి పేరుతో ఒక ఎకౌంట్ క్రియేట్ చేసి కొంత మందిని మంచి కథలు ఉంటే పంపాలని, సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పాడు.
దాంతో కొందరు అతను నిజంగానే శ్రీనివాస్ రెడ్డి అనుకోని వారి పర్సనల్ విషయాలను కూడా రవి కిరణ్ తో షేర్ చేసుకున్నారు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న నటుడు శ్రీనివాస్ రెడ్డి ఊహించని షాక్ కి గురైయ్యారు అటు తర్వాత పోలీసులకి ఫిర్యాదు చేసారు. పోలీసులు నిందితుడిని పట్టుకుని కౌన్సెలింగ్ ఇచ్చి ఇంకో సారి ఇటువంటి మోసాలు చేస్తే కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించి అతన్ని విడిచి పెట్టారు. ఈ విధంగా నకిలీ శ్రీనివాస్ రెడ్డి ని పోలీసులు హెచ్చరించారు.